Virat kohli biography in telugu language courses
Virat Kohli: 100 టెస్టుల వీరుడు.. సెంచరీ టెస్ట్‌లో సెంచరీ కొడతాడా?
- రచయిత, పరాగ్ పాఠక్
- హోదా, బీబీసీ మరాఠీ
విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్‌ను మొహాలీలో ఆడుతున్నాడు. ఈ మైలురాయి అందుకున్న 12వ భారత క్రికెట్ ఆటగాడు విరాట్.
ఈ ప్రయాణంలో కోహ్లీ ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు.
శుక్రవారం శ్రీలంకతో మొదలైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆడిన కోహ్లీ 76 బంతుల్లో 45 పరుగులు చేసి అవుటయ్యాడు.
భారత క్రికెట్ జట్టు 2014లో ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో తన ముద్ర వేయటం అప్పుడే మొదలైంది.
నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడతడు. ప్రదర్శనలో నిలకడ చూపాడు. ఫిట్‌నెస్‌లో సాటి లేదు. భారత జట్టు తరఫున ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఉన్న కోహ్లీ మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ పరిస్థితులు ప్రతికూలించాయి.
ఇంగ్లండ్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడటం కోహ్లీకి అదే తొలిసారి. అతడు దారుణంగా విఫలమయ్యాడు. వాతావరణం మేఘావృతంగా ఉంది. పిచ్ స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంది.
జేమ్స్ ఆండర్సన్ వంటి బౌలర్లు అత్యుత్తమంగా రాణిస్తున్న సమయంలో వారిని ఎదుర్కొన్నాడు. కోహ్లీని ఆండర్సన్ తన ఔట్-స్వింగర్లతో తిప్పలుపెట్టాడు. ఆ సిరీస్‌లోని అన్ని మ్యాచుల్లో కోహ్లీని ఆండర్సన్ దాదాపు వెంటనే ఔట్ చేశాడు. టెక్నిక్‌లో పట్టుసాధించాడని ప్రశంశలు పొందిన అదే కోహ్లీ ఇతడేనా అని జనం ఆశ్చర్యపోయారు.
ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది.
వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
2014 ఇంగ్లండ్ టూర్ మొదలు కావటానికి ముందు..
భారత క్రికెట్‌లో 'తర్వాతి పెద్ద విషయం' కోహ్లీ అని భావించారు. కానీ ఆండర్సన్‌ను ఎదుర్కొన్న ప్రతిసారీ కోహ్లీ తడబడటంతో ఇంగ్లండ్ మీడియా అతడిని తీవ్రంగా విమర్శించింది. ప్రతి ఒక్కరూ వారి సొంత మైదానాల్లో వీరులేనని, కానీ అంతే సులువుగా పరాయి గడ్డ మీద నాణ్యమైన బౌలర్లను ఎదుర్కొని మంచి పరుగులు సాధించిన వారే నిజమైన గొప్ప బ్యాట్స్‌మన్ అవుతారని వాళ్లన్నారు.
ఆ టూర్‌లో ఆడిన ఐదు టెస్ట్ మ్యాచుల్లో కోహ్లీ వరుస ఇన్నింగ్స్‌లో 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులు చేశాడు.
బంగారం కొలిమిలో మండి బయటకు వచ్చాకే మెరుస్తుందనేది సామెత. కోహ్లీ విషయంలో అదే జరిగింది. మీడియా విమర్శలు అతడిని భయపెట్టలేదు. ఇండియాకు తిరిగొచ్చాక తన టెక్నిక్ మీద సాధన చేశాడు. అందులో తప్పుల్లేకుండా ఉండటానికి ప్రయత్నించాడు.
ఆల్-టైమ్ గ్రేట్ బాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌ని సంప్రదించాడు. తన కోచ్‌ల మార్గదర్శకత్వంలో గంటల తరబడి ప్రాక్టీస్ చేశాడు.
ఇంగ్లండ్ టూర్ చేదు జ్ఞాపకాల నుంచి కోహ్లీ బయటపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ అతడు పడిన కష్టం ఫలించింది. అడిలైట్‌లో ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌లోనూ రెండు సెంచరీలు చేశాడు.
ఇంగ్లండ్‌లో ఆండర్సన్ ముందు లొంగిపోయిన కోహ్లీ.. ఆస్ట్రేలియాలోని ఫాస్ట్-పేస్డ్ వికెట్‌ని తట్టుకుని నిలబడగలడా, దూకుడైన ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఎదుర్కోగలడా అని కొందరు సందేహాలు లేవదీశారు.
ఈ కథనంలో Trill అందించిన సమాచారం కూడా ఉంది.
వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
ఆ విమర్శలకు కోహ్లీ తన బ్యాట్‌తో బదులిచ్చాడు.
మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టుల్లోనూ సెంచరీలు చేశాడు. 2014 ఇంగ్లండ్ టూర్ మొదలుకుని.. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్ మొదలుకావటానికి ముందు వరకూ ఉన్న కాలం.. తన కెరీర్‌లో అత్యంత కష్ట కాలమని కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ కీలక సమయంలో తను డిప్రెషన్‌కు లోనయ్యానని కూడా అంగీకరించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడటంలో తన సామర్థ్యం మీద తనకే అనుమానం వచ్చిందని చెప్పాడు.
Nica burns biography appreciated mahatmaతప్పులు సరిదిద్దుకోవటానికి కోహ్లీ చాలా కష్టపడ్డాడు. తనలో తాను కుమిలి పోకుండా.. తన టెక్నిక్‌కు పదును పెట్టటం మీద కృషి చేశాడు. అతడి శారీరక దారుఢ్యం అప్పటికే ప్రమాణాలకు తగ్గట్టుగా ఉంది. మానసికంగా కూడా తాను దృఢంగానే ఉన్నానని అతడు నిరూపించాడు.
ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత కోహ్లీ ఇక వెనుతిరిగి చూడలేదు. కోహ్లీ స్వాభావికంగా వన్-డే, ట్వంటీ-20 ఫార్మాట్‌లలో బలంగా షాట్లు కొట్టే ఆధునిక క్రికెటర్ అయినా కూడా..
టెస్ట్ మ్యాచ్‌లు ఆడటానికి ప్రాధాన్యం ఇస్తాడు. టెస్ట్ ఫార్మాట్.. ఒక క్రికెటర్ నైపుణ్యాన్ని, మానిసక సామర్థ్యాన్ని, శారీరక పటుత్వాన్ని పరీక్షిస్తుందని అతడు చెప్తాడు. భారత టెస్ట్ క్రికెట్ టీమ్‌లో భాగమైనందుకు తాను గర్విస్తానని కూడా అతడు పదే పదే చెప్పాడు. ఇప్పుడతడు 100వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు.
ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది.
వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
ఇంతదూరం ప్రయాణించిన భారత క్రికెటర్లలో కోహ్లీ 12వ ఆటగాడు.
ఈ ఘనత సాధించిన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరబ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, అనిల్ కుంబ్లే, ఇషాంత్ శర్మ, హర్బజన్ సింగ్ వంటి హేమాహేమీల సరసన కోహ్లీ చేరుతున్నాడు. కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేసినపుడు రాహుల్ ద్రావిడ్ ఇంకా ఆడుతున్నాడు. కోహ్లీ తన కెరీర్‌లో 100వ టెస్ట్ ఆడుతున్నపుడు..
ద్రావిడ్ హెడ్ కోచ్‌గా భారత జట్టును గైడ్ చేస్తున్నాడు.
కోహ్లీ 2011 జూన్ 20-24 తేదీల్లో కింగ్‌స్టన్‌లో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అదే మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ అభినవ్ ముకుంద్, బౌలర్ ప్రవీణ్ కుమార్ కూడా అరంగేట్రం చేశారు. కానీ భారత జట్టు తరఫున అభినవ్ 7 టెస్ట్ మ్యాచ్‌లు, ప్రవీణ్ 6 టెస్టులు మాత్రమే ఆడగలిగారు.
కోహ్లీ మాత్రం తన బ్యాట్‌తో, భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కూడా చరిత్ర సృష్టించాడు.
వంద మ్యాచ్‌లకు చేరుకున్న కోహ్లీ టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో.. జట్టు నుంచి అతడిని ఎప్పుడూ పక్కనపెట్టలేదు. ఆటలో అతడి నిలకడకు ఇది మరో నిదర్శనం.
కోహ్లీ టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ అయినపుడు..
జట్టులో ఐదుగురు బౌలర్లతో ఆడటానికి మొగ్గుచూపేవాడు. ఐదుగురు బ్యాట్స్‌మన్, ఒక వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్, ఐదుగురు బౌలర్లు.. అతడి ఆదర్శ జట్టు. విదేశీ గడ్డ మీద టెస్ట్ సిరీస్ గెలవటం ఏ జట్టుకైనా ఒక సవాలే. కోహ్లీ ఆ సవాలును స్వీకరించాడు. అతడి సారథ్యంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచింది. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నపుడు భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థాయికి చేరుకుంది.
భారత జట్టులోని విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆటగాళ్లు కేల్ విలియమ్సన్, స్టీవెన్ స్మిత్, ఇంగ్లండ్ క్రీడాకారుడు జో రూట్ - ఈ నలుగురు సమకాలీన క్రికెటర్లకూ ఎవరికి వారే ప్రత్యేకమైన శైలి ఉంది. కానీ వీరిని కలిపే సారూప్యత ఒకటి ఉంది - ఈ నలుగురూ హార్డ్ హిట్టర్లు.
నలుగురూ తమ తమ జట్లలో అనతి కాలంలోనే లీడింగ్ బాట్స్‌మన్ అయ్యారు.
Buvaisar saitiev brandon slay biographyనలుగురూ తమ జట్లకు కెప్టెన్లయ్యారు. ఈ నలుగురూ తమ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. వీళ్లు చాలా కొత్త రికార్డులు కూడా నెలకొల్పారు. అందుకే వీరిని ప్రపంచ క్రికెట్‌లో ఫాబ్యులస్ ఫోర్ అని పిలుస్తారు.
కోహ్లీ ఇప్పటివరకూ ఆడిన Cardinal టెస్టుల్లో 68 టెస్టులకు కెప్టెన్‌గా, లీడింగ్ బ్యాట్స్‌మన్‌గా కూడా ఉన్నాడు.
ఈ రెండు బాధ్యతలనూ సమర్థవంతంగా మోశాడు. ఈ 68 మ్యాచుల్లో కోహ్లీ 54.80 సగటుతో 5,864 రన్స్ స్కోర్ చేశాడు. టెస్ట్ సెంచరీల్లో స్టీవెన్ స్మిత్, విరాట్ కోహ్లీలు చెరో 27 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు. కోహ్లీ గత టెస్ట్ సెంచరీ 2019లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో చేశాడు. గత రెండేళ్లుగా అతడు సెంచరీ చేయలేదు. రన్స్ చేస్తున్నాడు కానీ సెంచరీ చేయలేదు.
భారత టీ-20 ఫార్మట్ జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. వన్-డే క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించారు. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా టూర్ తర్వాత టెస్ట్ జట్టు కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ వైదొలిగాడు. కాబట్టి కెప్టెన్ మీద ఉండే ఒత్తిడి అతడి మీద లేదు. తమ 100వ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్ చాలా తక్కువ.
కోహ్లీ తన సెంచరీ మ్యాచ్‌లో సెంచరీ కొట్టటానికి ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)